తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగులకు కట్​.. ప్రైవేటు ఉద్యోగులకేమో పూర్తి జీతాలా..

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై కోత విధించడాన్ని సీఎల్పీనేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ప్రైవేటు ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వాలని చెప్పిన కేసీఆర్​ ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

CLP leader bhatti vikramarka is to slash the salaries of state employees at Hyderabad
ప్రభుత్వ ఉద్యోగులకు కట్​.. ప్రైవేటు ఉద్యోగులకేమో పూర్తి జీతాలా..

By

Published : Apr 1, 2020, 6:32 AM IST

మిగులు బడ్జెట్​ కలిగిన రాష్ట్రంలో కేవలం 13 రోజుల లాక్​డౌన్​కే ఉద్యోగస్థులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క హైదరాబాద్​లో ఆ​రోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మధ్యలోకి పెద్ద ఎత్తున డబ్బుని సర్క్యూలేషన్​లోకి తీసుకురావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా మొత్తం జీతం చెల్లించాలి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. కోటి 82 లక్షల బడ్జెట్​ కలిగిన రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షన్​దార్లకు సుమారు 3,500 కోట్లు చెల్లించలేదా అని నిలదీశారు.

ఇదీ చూడండి:ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details