తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా వేళ... ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది'

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోన్న కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. అందుకోసం విస్తృత ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సిబ్బంది కొరతను తీర్చాలని ప్రభుత్వానికి కోరారు.

clp leader bhatti speaks on corona effect in assembly
కరోనాపై విస్తృత ప్రచారం చేయాలి: భట్టి

By

Published : Mar 15, 2020, 4:45 PM IST

ఏ రాష్ట్రంలో విద్య, వైద్య సేవలు బాగుంటాయో అక్కడ అభివృద్ధి జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి అన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మాస్క్‌లు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత వేధిస్తోందన్నారు. అన్నిరకాల వైద్య సంస్థల్లో అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తై.. అందుబాటులోకి రాని 54 ఆస్పత్రులున్నాయని గుర్తు చేశారు. వాటిలో వెంటనే సేవలు ప్రారంభించాలన్నారు. ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థలో ఉందని.. వెంటనే ఆయా భవనాలను మెరుగుపరచాలని కోరారు.

శాసనసభ నియోజకవర్గాల్లో ఇండోర్‌ స్టేడియాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. గ్రూపు- 1 పరీక్షలు, ఇతర ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదల చేయాలన్నారు. పోలీసు ఉద్యోగ నియమకాల సమస్యను వెంటనే పరిష్కరించాలని భట్టి విక్రమార్క కోరారు.

కరోనాపై విస్తృత ప్రచారం చేయాలి: భట్టి

ఇవీచూడండి:సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలపై స్పీకర్​కు ఫిర్యాదు: భట్టి

ABOUT THE AUTHOR

...view details