అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపన్యాసాలు ఇచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అనుకున్న దానికంటే ముందే బడ్జెట్ సమావేశాలు ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. బడ్జెట్లో అంకెలను పెంచి చూపారని విమర్శించారు. ఈ టర్మ్ అయిపోయే లోపు.. రాష్ట్ర అప్పులు రూ. 5 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
సమాధానం ఇవ్వమంటే ఉపన్యాసం ఇచ్చారు: భట్టి
కారణాలు ఏవైనా... అనుకున్న దానికంటే ముందే బడ్జెట్ సమావేశాలు ముగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపరిచిందన్నారు.
రాష్ట్ర బడ్జెట్‌పై భట్టి స్పందన