తెలంగాణ

telangana

ETV Bharat / state

'సిరిసిల్ల ఆస్పత్రిలో సైతం వైద్యులు లేక ఇబ్బందులు'

రాష్ట్రంలో కరోనా కేసుల కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు.

clp leader bhatti comment Sircilla Hospital also has doctors or complications
'సిరిసిల్ల ఆస్పత్రిలో సైతం వైద్యులు లేక ఇబ్బందులు'

By

Published : Aug 28, 2020, 7:00 AM IST

రాష్ట్రంలో కరోనా కేసుల కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆస్పత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

సీఎం కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల ఆస్పత్రిలో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 26 మంది డాక్టర్లకు 13 మంది మాత్రమే డాక్టర్లు ఉన్నారని, 131 పారామెడికల్ సిబ్బందికి 77 ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో కేవలం 110 మందికి సేవలందిస్తూ, మిగతా 1700 వందల కరోనా రోగులను హోం క్వారంటైన్​లో ఉంచి వైద్యం అందించడం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. ఇప్పటికైనా ఆస్పత్రిలో ఖాళీలను భర్తీ చేసి, కరోనా రోగులకు అవసరమైన మెడికల్ కిట్లను, సిటీ స్కాన్ ఏర్పాటు చేయడానికి నిధులు సమకూర్చాలని సూచించారు.

ఇదీ చూడండి :ఆర్టీసీ నిధులన్నీ హాంఫట్‌!

ABOUT THE AUTHOR

...view details