తెలంగాణ

telangana

ETV Bharat / state

దత్తత వ్యవహారంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కరాటే కల్యాణికి వార్నింగ్ - clean chit for karate kalyani in child adoption case

Karate Kalyani: చిన్నారి దత్తత వ్యవహారంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సినీనటి కరాటే కల్యాణిని అధికారులు హెచ్చరించారు. ఇవాళ సీడబ్ల్యూసీ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చారు. అనంతరం పాపను అసలు తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంతటితో ఈ సమస్య ముగిసిందని కల్యాణి తెలిపారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిని చట్టబద్ధంగానే ఎదుర్కొంటానని ఆమె స్పష్టం చేశారు.

karate kalyani
కరాటే కల్యాణిపై పాప దత్తత కేసు

By

Published : May 18, 2022, 7:07 PM IST

Updated : May 18, 2022, 7:14 PM IST

Karate Kalyani: దత్తత తీసుకోవాలంటే న్యాయబద్ధంగానే తీసుకుంటానని... పాపను దత్తత తీసుకోలేదని ఆ పాప తల్లిదండ్రులే తమతో పాటు ఉంటున్నారని సినీ నటి కరాటే కల్యాణి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లోని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. అనంతరం కల్యాణి వద్ద ఉన్న పాపను సీడబ్ల్యూసీ అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కావడంతో కేసును రంగారెడ్డి జిల్లా అధికారులకు బదలాయించారు. దత్తత తీసుకునే విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కల్యాణిని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు.

సీడబ్ల్యూసీ ఎదుట విచారణ అనంతరం పాపతో కరాటే కల్యాణి

రెండు రోజుల నుంచి తనపై అనేక ఆరోపణలు వచ్చాయని కరాటే కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలకు కలత చెంది.. తన తల్లి, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామన్నారని.. తాను వారికి ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. తాను బీసీ వర్గానికి చెందిన బిడ్డను కాబట్టే రాజకీయంగా ఎదుర్కోలేక.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేసిన వారిలో కొందరు రాజకీయనాయకులు, అధికారులు ఉన్నారని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేసిన వారిని చట్టబద్ధంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కాగా చిన్నారి దత్తత వ్యవహారంలో కరాటే కల్యాణి కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే..

Last Updated : May 18, 2022, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details