తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యాంపస్‌లో సినిమా లొల్లి... కశ్మీరీ ఫైల్స్ VS మోదీ బీబీసీ డాక్యుమెంటరీ!

హెచ్‌సీయూలో ఓ సినిమాతో రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య వార్ మొదలైంది. క్యాంపస్‌లో కశ్మీరీ ఫైల్స్ సినిమా ప్రదర్శిస్తామని ఏబీవీపీ విద్యార్థులు తెలపగా.. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామని చెప్పారు. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత మొదలైంది.

Clash between ABVP And SFI student unions in HCU
క్యాంపస్‌లో సినిమా లొల్లి... కశ్మీరీ ఫైల్స్ VS మోదీ బీబీసీ డాక్యుమెంటరీ!

By

Published : Jan 26, 2023, 9:20 PM IST

Updated : Jan 26, 2023, 10:42 PM IST

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నాలుగు రోజుల క్రితం ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్ధి సంఘాలు ప్రధాని మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీను క్యాంపస్‌లో స్క్రీనింగ్ చేశారు. ఇందుకు ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏబీవీపీ విద్యార్ధి సంఘం కశ్మీరి ఫైల్స్ సినిమాను స్క్రీనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.

ఎస్‌ఎఫ్‌ఐ కూడా ఆదే సమయానికి బీబీసీ డాక్యుమెంటరీ చూస్తామని పిలుపునిచ్చింది. దీంతో బయట నుంచి ఏబీవీపీ విద్యార్ధి సంఘం నేతలు ప్రోజెక్టర్లు, తెరలు తెప్పించారు. వీటిని హెచ్‌సీయూ సెక్యూరిటి సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఏబీవీపీ ఆందోళనకు దిగింది. బయట నుంచి వేరే పరికరాలు తెప్పించి సినిమాను చూశారు.

హెచ్‌సీయూ లేడీస్ హాస్టల్ సమీపంలో బీబీసీ డాక్యుమెంటరీని, నార్త్ బ్లాక్‌లో కశ్మీరీ ఫైల్స్ సినిమాను స్క్రీనింగ్ చేసింది. దీంతో గచ్చిబౌలి పోలీసులు ప్రధాన గేటు వద్ద సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఈ దశలో క్యాంపస్‌లో స్క్రీనింగ్ నిలిపివేయాలని... లా అండ్ ఆర్టర్ సమస్య తలెత్తుతుందని రిజిస్టార్ దేవేష్ నిగమ్ విద్యార్దులకు తెలిపారు. మరో వారంలో సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున్న క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం ఉండేందుకు సహకరించాని కోరారు.

ఇక 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విజయాన్ని దక్కించుకుంది ఈ చిత్రం. ఈ సినిమాను వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేశారు. కాగా, బీబీసీ మోదీ డాక్యుమెంటరీని భారత్‌లో ప్రదర్శించవద్దని కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే దానిని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jan 26, 2023, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details