నాంపల్లి కోర్టు న్యాయవాది పోస్టులో పంపించిన లేఖపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI justice NV Ramana ) స్పందించారు. సీఆర్పీసీ 41 ఏ (CRPC 41 A ) సెక్షన్ రద్దు చేయాలని.... న్యాయవాదుల సంఘం తరఫున.. జక్కుల లక్ష్మణ్ ఆగస్టు 26న సీజేఐ (CJI justice NV Ramana )కి లేఖ రాశారు. స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI justice NV Ramana ).... తగిన చర్యలు తీసుకోవాలని లేఖను జాతీయ న్యాయసేవాధికార సంస్థకు పంపించారు.
నాంపల్లి కోర్టు న్యాయవాది లేఖకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందన
సీఆర్పీసీ 41 ఏ సెక్షన్ (CRPC 41 A ) రద్దు చేయాలని నాంపల్లి కోర్టు న్యాయవాది రాసిన లేఖకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI justice NV Ramana ) స్పందించారు. సీజేఐ లేఖను జాతీయ న్యాయ సేవాధికార సంస్థకు పంపారు. లేఖపై జస్టిస్ ఎన్వీ రమణ స్పందించడం గొప్ప విషయమని న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
జాతీయ న్యాయసేవాధికార సంస్థ వారు తెలంగాణ న్యాయసేవాధికార సంస్థకు పంపించారు. లేఖ అందిన వెంటనే సీజేఐ (CJI justice NV Ramana ) స్పందించడం గొప్ప విషయమని..... నాంపల్లి బార్ అసోసియేషన్ కార్యదర్శి జక్కుల లక్ష్మణ్, అసోసియేషన్ అధ్యక్షుడు మధు శేఖర్ ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు సీఆర్పీసీ 41ఏ ను దుర్వినియోగం చేస్తున్న తీరును కమిటీకీ వివరిస్తామన్నారు.