యాసంగి ధాన్యం సేకరణ దాదాపు పూర్తయిందని పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఖరీఫ్, రబీలో కోటీ 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు. ఒక్క యాసంగిలోనే 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామన్న ఆయన.. మరో 50 వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందన్నారు.
MAREDDY: యాసంగి ధాన్యం సేకరణ పూర్తయినట్లే: మారెడ్డి
ఈ యాసంగి సీజన్లో రైతుల నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు 63-114 శాతం పెరిగాయని తెలిపారు.
యాసంగి ధాన్యం సేకరణ పూర్తయినట్లే: మారెడ్డి
ఇప్పటికే 20 జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తయిందని.. కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు 63-114 శాతం పెరిగాయని మారెడ్డి పేర్కొన్నారు. మొత్తం 15 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించామన్న ఆయన.. విలువ రూ.17 వేల కోట్లని తెలిపారు. ఇప్పటికే రూ.14 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని.. నిన్న, ఇవాళ మరో రూ.2 వేల కోట్లు విడుదల చేశామని వెల్లడించారు.
Highcourt: దేవరయాంజల్ భూముల గుర్తింపునకు విచారణ చేస్తే ఇబ్బందేంటి?