రాబోయే వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండపాల అనుమతులు,విద్యుత్ సరఫరా, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు అంశాలపై వారు చర్చించారు. చతుర్థి నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సీపీ సూచించారు.
వినాయక చవితి ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష - మిషనర్ కార్యాలయం
వినాయక చవితిని పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై నగర సీపీ అంజనీ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు.
వినాయక చవితి ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష