తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేట్ శక్తుల కోసమే రైల్వేల ప్రైవేటీకరణ

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ను ప్రైవేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైల్వేలను ప్రైవేటీంచకుండా ఆపాలని లేనిపక్షంలో భవిష్యత్తులో పోరాటాలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

కార్పొరేట్ శక్తుల కోసమే రైల్వేల ప్రైవేటీకరణ

By

Published : Aug 8, 2019, 5:33 PM IST

దేశంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే ప్రైవేటీకరణ చేయటం దారుణమన్నారు సీఐటీయూ నేతలు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దేశంలో 70 రైల్వే స్టేషన్లను, వర్క్ షాప్​లను కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఇకమీదట పేదలకు రైల్వే ప్రయాణం భారం కానుందని వెల్లడించారు. గత సంవత్సరం దక్షిణ మధ్య రైల్వే పదివేల కోట్ల లాభాలను ఆర్జించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయాలనుకోవడం దారుణమని విమర్శించారు.

కార్పొరేట్ శక్తుల కోసమే రైల్వేల ప్రైవేటీకరణ

ABOUT THE AUTHOR

...view details