మున్సిపల్ కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఎల్బీనగర్ ఈస్ట్ జోన్ మున్సిపల్ పరిధిలో గతేడాది నవంబర్‌లో రిక్రూట్ చేసుకున్న సుమారు 500మంది మున్సిపల్ కార్మికులకు ఐదు నెలల నుంచి జీతాలు చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కాంట్రాక్టు సమయం ముగిసిందని... ఉద్యోగం లేదంటూ శ్రమ దోపిడి చేయడం దుర్మార్గమని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తొలగించిన మున్సిపల్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి' - తెలంగాణ వార్తలు
ఎల్బీనగర్ ఈస్ట్ జోన్ మున్సిపల్ పరిధిలోని కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సమయం ముగిసిందని తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం లేదంటూ శ్రమ దోపిడి చేయడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఐటీయూ ధర్నా, మున్సిపల్ సిబ్బంది ధర్నా
కార్మికులను తిరిగి పనిలోకి తీసుకుని వెంటనే వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వీరిని రెగ్యులర్ కార్మికుల మాదిరిగా గుర్తించి... పీఎఫ్, ఈఎస్‌ఐ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఉపాధ్యక్షుడు నర్సిరెడ్డి, ఎల్బీనగర్ సర్కిల్ సీఐటియూ కార్యదర్శి అలేటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ టీకా పేరడి పాట మీరు వినండి..!