తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనాను నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'

సికింద్రాబాద్​లోని రేతిఫైల్​ బస్టాండ్​ వద్ద సీఐటీయూ నాయకులు ధర్నా చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్మికులను తీసేస్తున్న ప్రైవేటు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

citu leaders protest against central and state governmrnts
citu leaders protest against central and state governmrnts

By

Published : Jul 3, 2020, 6:58 PM IST

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి మల్లేశ్​ మండిపడ్డారు. సికింద్రాబాద్​లోని రేతిఫైల్ బస్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరోనాను నివారించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మల్లేశ్​ విమర్శించారు. కార్మికులకు లాక్​డౌన్ కాలానికి సంబంధించి పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేశారు.

ఉద్యోగుల తొలగింపుపై ప్రైవేటు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కో కార్మికునికి పది కిలోల చొప్పున ఆరు నెలల పాటు సన్న బియ్యం అందించాలన్నారు. ప్రతీ కార్మిక కుటుంబానికి నెలకు రూ.7500 చొప్పున మూడు నెలలపాటు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల జీవన మనుగడపై భారం మోపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయని మండిపడ్డారు. ఈ విషయంలో పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచడంపై పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి:రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు

ABOUT THE AUTHOR

...view details