తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సీఐటీయూ ఆందోళన - protest against rates increse

హైదరాబాద్​ చిలకలగూడలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచటాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచటం వల్ల ఆ ప్రభావం నిత్యావసర ధరల మీద పడుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్​ చేశారు.

citu conducted protest against petrol and diesel rates increse
citu conducted protest against petrol and diesel rates increse

By

Published : Jun 27, 2020, 5:52 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచటాన్ని నిరసిస్తూ హైదరాబాద్​ చిలకలగూడలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు కొన్నిరోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ జోన్ కార్యదర్శి మల్లేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఆరునెలల పాటు వాయిదాల చెల్లింపు నిలిపివేయాలని, అత్యవసర సేవలందిస్తున్న డ్రైవర్లకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని మల్లేశ్​ డిమాండ్​ చేశారు. పాఠశాలలు, కళాశాలలు అదనపు ఫీజు భారం మోపకుండా లైసెన్స్ రెన్యువల్ చేసి విద్యార్థులకు అందించాలన్నారు. ఫీజులు రెట్టింపు చేసిన యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇకనైనా నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చూడండి:ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల

ABOUT THE AUTHOR

...view details