తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణకు చెందిన సంస్థల్లో ముగిసిన ఏపీ సీఐడీ సోదాలు - nspira

హైదరాబాద్ మాదాపూర్​లోని నారాయణకు చెందిన ఎన్​ స్పిరా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏపీ సీఐడీ సోదాలు నేడూ కొనసాగాయి. అమరావతిలో భూముల కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో రెండ్రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు.

cid searches
సిఐడీ సోదాలు

By

Published : Jan 11, 2023, 10:13 PM IST

ఏపీ మాజీ మంత్రి నారాయణకు చెందిన ఎన్ స్పిరా ప్రైవేట్​ లిమిటెడ్ కంపెనీలో ఏపీ సీఐడీ సోదాలు రెండోరోజూ కొనసాగాయి. మాదాపూర్​లోని మెలాంజ్ టవర్స్​లో ఈ కార్యాలయం ఉంది. అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు నిన్న ఉదయం పది గంటల నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు. తిరిగి ఇవాళ ఉదయం నుంచే సోదాలు ప్రారంభించారు. సోదాల్లో సుమారు 40 మంది అధికారుల బృందం పాల్గొన్నట్లు తెలుస్తోంది.

కంపెనీలోని కంప్యూటర్లను పరిశీలించారు. పలు హార్డ్ డిస్క్​లను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది సిబ్బంది వద్ద నుంచి కూడా వివరాలు సేకరించినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. నేటితో సోదాలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details