తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడిపల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో దొంగల హల్​చల్ - మేడిపల్లి పోలీస్​స్టేషన్

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కమలానగర్​లో దొంగలు చెలరేగిపోయారు. ఓ ఇంట్లో చొరబడి 19 తులాల బంగారు ఆభరణాలు, రూ. 3 లక్షల 50 వేల నగదు ఎత్తుకెళ్లారు.

దొంగల హల్​చల్

By

Published : Sep 19, 2019, 12:00 AM IST

రాచకొండ పోలీస్ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం అపహరించారు. కమలానగర్​లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి సంతోశ్​ కుమార్ ఇంటికి తాళం వేసి కూకట్​పల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలో భద్రపరిచిన 19 తులాల బంగారు ఆభరణాలు, రూ. 3 లక్షల 50 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వేలిముద్రల నిపుణులతో ఆధారాలు సేకరించారు. దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నా.. దొంగలు చెలరేగిపోతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

దొంగల హల్​చల్

ABOUT THE AUTHOR

...view details