Students Refused Midday Meals: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వికోట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉడకని భోజనం మాకొద్దంటూ విద్యార్థులు పడేశారు. శుక్రవారం మధ్యాహ్నం వండిన భోజనం ఉడకలేదని.. ఇది తినడం వల్ల తాము అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు తినకుండా పక్కన పడేశారు. ఉడకని అన్నం.. సగం ఉడికిన కోడిగుడ్లు తినలేక చెత్తకుప్పలో వేసేశారు. ఇలాంటి ఉడికీ ఉడకని భోజనాన్నిపెడితే.. పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా మధ్యాహ్న భోజనం ఎలా ఉన్నా ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు అంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
'ఉడికీ ఉడకని అన్నం.. సగం ఉడికిన కోడిగుడ్లు.. మాకొద్దు..' - Palamaneru Government Girls High School
Students Refused Midday Meals: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తినేందుకు విద్యార్థులు నిరాకరించారు. ఉడకని భోజనం మాకొద్దని పడేశారు. ఈ అన్నం తినడం వల్ల తాము అనారోగ్యం పాలవుతున్నామని ఆరోపించారు. నిర్వాహకులకు భోజనం వండటంలో అనుభవం లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
!['ఉడికీ ఉడకని అన్నం.. సగం ఉడికిన కోడిగుడ్లు.. మాకొద్దు..' refused midday meals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16839170-763-16839170-1667619324019.jpg)
refused midday meals
ఈ ఉడకని అన్నం మాకొద్దు.. మధ్యాహ్న భోజనాన్ని పడేసిన విద్యార్థులు..
ఈ పాఠశాలలో 10 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం వండేవారిని తొలగించి, ఇటీవల కొత్త నిర్వాహకులకు మధ్యాహ్న భోజనం పనిని అప్పగించారు. నిర్వాహకులకు భోజనం వండటంలో అనుభవం లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. 600 మంది విద్యార్థులున్న పాఠశాలలో.. అనుభవం లేని వారికి పనిని అప్పగిస్తే ఎలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కొంత మంది అధికారులు, నేతలు వారి స్వప్రయోజనాల కోసం.. మధ్యాహ్న భోజనంతో ఆటలాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: