హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో సుజీ అనే చింపాంజీ 34వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2011 సంవత్సరంలో సహారా గ్రూప్ వారు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు సుజీని బహుమతిగా ఇచ్చారు. సుజీ కోసం పండ్లు, చపాతీతో ఫ్రూట్ కేక్ తయారు చేశారు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో జూ అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా చింపాంజీ సుజీ జన్మదిన వేడుకలు - హైదరాబాద్ వార్తలు
ఈ మధ్య పెంపుడు జంతువులపై ప్రేమ ఎక్కువై పుట్టిన రోజులు చేస్తున్నారు యజమానులు. అదే తరహాలో హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో చింపాంజీకి జన్మదిన వేడుకలు జరిపారు.
ఘనంగా చింపాంజీ సుజీ జన్మదిన వేడుకలు