రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా వరద నీటిలో చిక్కుకున్న వారిని ఆదుకోవడానికి చిక్కడపల్లి పోలీసులు ముందుకు వచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని హుస్సేన్‌సాగర్ నాలా పరివాహక ప్రాంత ప్రజలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. వర్షం కారణంగా ప్రజలు బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
చిక్కడపల్లి పోలీసుల దాతృత్వం.. వరద బాధితులకు ఆహారం - హైదరాబాద్ తాజా వార్తలు
భారీ వర్షం తాకిడికి భాగ్యనగరం అతలాకుతలం అయిపోయింది. లోతట్టు ప్రాంతాలు, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. నాలా పరివాహక ప్రాంతాల ప్రజలకు ఆహార పొట్లాలను అందజేశారు.
మానవత్వం చాటుకున్న చిక్కడపల్లి పోలీసులు.. ఆహారం పంపిణీ