జీవ కోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యతని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో ఆయన మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్, హెచ్ఎండీఏ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
చెట్లను నాటడం మనందరి బాధ్యత: సీఎస్ సోమేశ్‌కుమార్ - Somesh Kumar planted the sapling
తన పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో సీఎస్ సోమేశ్ ఆయన మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన కోరారు.
ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొనండి
సమాజం పట్ల బాధ్యత, భవిష్యత్తు తరాల బాగు కోసం ప్రకృతి పట్ల అవగాహనతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్‌కుమార్ తీసుకున్న ఈ వనయజ్ఞంలో ప్రజలంతా స్వచ్ఛందంగా మొక్కలు నాటడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన హరిత హారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు హరితహారంలో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.
ఇవీ చదవండి: