ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం దిల్లీ వెళ్లే (kcr tour in delhi) అవకాశముంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది.
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చిస్తారు. దిల్లీ సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి... రాష్ట్రం తరఫున ఉంచాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు.
మావోయిస్టు వారోత్సవాలు...
భారత కమ్యూనిస్టు పార్టీ (cpi) (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నుంచి జరుగుతున్నాయి. వారోత్సవాలను(Maoist Weeks) ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్, పార్టీ అధికార ప్రతినిధి జగన్‌తో పాటు బీకేటీజీ (భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి) డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ లేఖలు విడుదల చేశారు.
అప్రమత్తమైన కేంద్రం