తెలంగాణ

telangana

ETV Bharat / state

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్​లో మార్పులు.. తేదీలివే!

Changes in Telangana EAMCET Exam Schedule: తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్​లో కీలక మార్పులు జరిగాయి. మే 7 నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష మాత్రం యాథావిధిగా జరుగుతాయని ఉన్నత విద్యామండలి తెలిపింది.

Changes in Telangana EAMCET Exam Schedule
Changes in Telangana EAMCET Exam Schedule

By

Published : Mar 31, 2023, 7:06 PM IST

Updated : Mar 31, 2023, 7:13 PM IST

Changes in Telangana EAMCET Exam Schedule: తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్​లో అధికారులు మార్పులు చేశారు. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల షెడ్యూల్​లో మార్పులు చేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేర్కొంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఎగ్జామ్​లను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నీట్, టీఎస్​పీఎస్సీ నిర్వహించే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని తేదీల్లో మార్పులు చేసినట్టుగా వారు తెలిపారు.

ఆలస్య రుసుముతో:అయితే మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ ఎంసెట్ దరఖాస్తుల గడువు కాలం ఏప్రిల్ 4తో ముగియనుంది. అయితే.. ఆలస్య రుసుము చెల్లింపులతో మే 2 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందుకుగాను ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు.. మరికొన్ని వాయిదా: ప్రశ్నపత్రం లీకేజీ ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయాలను తీసుకొంటుంది. ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి మరికొన్ని పరీక్షలను వాయిదా వేసిన కమిషన్.. తాజాగా టీఎస్​పీఎస్సీ నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్​ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. అయితే ఏప్రిల్ 4న జరగాల్సిన ఈ హార్టికల్చర్ ఎగ్జామ్​ను.. జూన్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

రద్దైన వాటికి కొత్త తేదీలు ఎప్పుడు..?: పేపర్ లీకేజీ వ్యవహారం తర్వాత సిట్ అధికారుల సూచనలు మేరకు టీఎస్​పీఎస్సీ ఇప్పటితే నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో, ఏఈ ఎగ్జామ్​లను రద్దు చేసిన విషయం తెలిసందే. అంతే కాకుండా ఈ నెలలో జరగాల్సి ఉన్న టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను సైతం కమిషన్ వాయిదా వేసింది. తాజాగా ఈ జాబీతాలకి హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష కూడా యాడ్ అయ్యింది.

ఏప్రిల్, మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించిన టీఎస్​పీఎస్సీ.. ఈ క్రమంలోనే రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటించే అవకాశమున్నట్లు తెలిపింది. సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షకు రెండు నెలల ముందుగా ప్రశ్నపత్రాలు సిద్ధంగా చేస్తారు. రానున్న రెండు నెలల్లో జరగాల్సి ఉన్న పరీక్షలకు పేపర్​లను సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 31, 2023, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details