జీహెచ్ఎంసీ కార్యాలయంలో జోనల్ కమిషనర్లతో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్లో పేదల ఆకలిబాధలు తీర్చే అన్నపూర్ణ కేంద్రాల పనితీరుపై చర్చించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున అన్నపూర్ణ మధ్యాహ్న భోజనం అందించే సమయాలు కుదించాలని సూచించారు.
అన్నపూర్ణ భోజన కేంద్రాల సమయంలో మార్పులు - ghmc latest updates
ఎండలు ఎక్కువగా ఉన్నందున అన్నపూర్ణ మధ్యాహ్న భోజనం అందించే సమయాలు కుదించాలని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం 11 నుంచి 12 వరకు, రాత్రి భోజనం 7 గంటలకే ముగించేలా చూడాలని తెలిపారు.
అన్నపూర్ణ భోజన కేంద్రాల సమయంలో మార్పులు
నగరంలో మరికొన్ని అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం పేదల కోసం చేసే కార్యక్రమాలతో ఎంతో మందికి మేలు జరుగుతుంది ఆయన అన్నారు.
ఇదీ చదవండి:తక్కువ ఖర్చుతో కరోనా చికిత్సకు వెంటిలేటర్