రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి... ఒక పండగ రోజు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరులో కార్యకర్తల సభలో పాల్గొన్న ఆయన.. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో పేదలకు కూడు, గుడ్డ కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు.
ఎస్సీ, ఎస్టీల హక్కులను జగన్ పాలన కాలరాస్తోంది: చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి జగన్.. తన పాలనలో ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన... రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాకుండా.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
babu on ambedkar and jagan
దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన బాలయోగిని లోక్సభ స్పీకర్గా ఎంపిక చేసిన చరిత్ర తెదేపాకు ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు ఇచ్చిందని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీల హక్కులను దాడులతో కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి:త్వరలోనే హైదరాబాద్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం: కేటీఆర్