kondapalli municipality: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని మండిపడ్డారు. విధ్వంసం సృష్టించి ఎన్నిక వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ధ్వజమెత్తారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే ఎస్ఈసీ, డీజీపీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికను అడ్డుకునే బదులు అధికార పార్టీ వారిని ఛైర్మన్ గా నియమించుకోవాలని దుయ్యబట్టారు.
kondapalli municipality : కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై చంద్రబాబు ఆగ్రహం - చంద్రబాబు నాయుడు తాజా వార్తలు
ఏపీలోని కొండపల్లి మున్సిపల్ (kondapalli municipality) ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని మండిపడ్డారు.
భయభ్రాంతులకు గురిచేసి తెదేపా సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని వ్యక్తులు మారణాయుధాలతో హల్ చల్ చేస్తున్నా... పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నారని విమర్శించారు. ఎంపీ నానితో సహా తెదేపా సభ్యులు క్రమశిక్షణ, ఓర్పుతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తమ సహనాన్ని చేతగానితనంగా పరిగణించొద్దని హెచ్చరించారు. కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.
ఇదీ చూడండి:TS MLC elections 2021: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనే కాంగ్రెస్ పోటీ