తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏలూరులో హెల్త్ ఎమ‌ర్జెన్సీ విధించాలి: చంద్రబాబు

ఏలూరులో హెల్త్ ఎమ‌ర్జెన్సీ విధించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ దుస్థితికి కార‌ణాల‌పై నిష్పక్షపాతంగా విచార‌ణ జ‌రిపించాల‌న్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే ఏలూరు ఘటన: చంద్రబాబు
ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే ఏలూరు ఘటన: చంద్రబాబు

By

Published : Dec 6, 2020, 8:03 PM IST

Updated : Dec 6, 2020, 10:46 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో హెల్త్ ఎమ‌ర్జెన్సీ విధించి.. దుస్థితికి గ‌ల కార‌ణాల‌పై నిష్పక్షపాతంగా విచార‌ణ జ‌రిపించాల‌ని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. 250 మందికి పైగా పెద్దలు, పిల్లలతో పాటు.. అస్వస్థతకు గురైన వాళ్లందరికీ మెరుగైన వైద్యం అందించాల‌ని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజ‌ల‌కు సుర‌క్షిత‌మైన తాగునీరు స‌ర‌ఫ‌రా చేయ‌లేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉంద‌ని.. క‌లుషిత జలాలు తాగి అస్వస్థత‌కు గురైతే వారి ఆరోగ్య సంర‌క్షణ గురించి ప‌ట్టించుకునే తీరిక లేని ప్రభుత్వం ఉండ‌టం దుర‌దృష్టక‌ర‌మ‌ని మండిపడ్డారు.

వరదలు, తుపానులు విరుచుకుప‌డిన‌ప్పుడు ప్రజ‌ల్ని అప్రమ‌త్తం చేయ‌డంలో విఫ‌ల‌మైన ప్రభుత్వం, వ‌ర‌ద స‌హాయ‌క ‌చ‌ర్యలు చేప‌ట్టడంలోనూ నిర్లక్ష్యం వ‌హించింద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజ‌ల క‌నీస అవ‌స‌రాలు తీర్చలేని చేత‌గాని పాల‌న కొన‌సాగుతోంద‌ని దుయ్యబ‌ట్టారు. ఎన్నుకున్న ప్రజలకు సురక్షితమైన తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలను అందించలేకపోవ‌డం జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం సిగ్గుప‌డాలని హితవు పలికారు.

ఇదీ చూడండి:దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం: కేటీఆర్

Last Updated : Dec 6, 2020, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details