పౌరసరఫరాల సంస్థకు 37కోట్లు ఆదా
సన్నబియ్యం సరఫరాలో పౌర సరఫరాల సంస్థకు 37కోట్ల రూపాయలు ఆదా కానుంది. గతేడాది సరఫరా చేసిన ధరకే ఈ ఏడాది పంపిణీ చేసేలా రైస్ మిల్లర్లు అంగీకరించారు.
ఏడాదికి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పాఠశాల విద్యార్థులకు అందిస్తోంది. ఈ బియ్యం కొనుగోలుకు సంబంధించి టెండర్లు నిర్వహించగా తుది రేటు క్వింటాల్‌కు రూ.3,590 కోట్ చేశారు. గత ఏడాది సరఫరా చేసిన ధరకే ఈసారి కూడా సరఫరా చేయాలని రైస్ మిల్లర్లను ఒప్పించారు. ఫలితంగా పౌర సరఫరాల సంస్థకు రూ. 37 కోట్లు ఆదా కానుంది. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంకోసం సరఫరా చేసే ఈ సన్న బియ్యం నాణ్యత, పరిమాణం విషయంలో పక్కాగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.