ఎన్నికల్లో దివ్యాంగుల ఓటింగ్ శాతం పెరుగుతుండటం సంతోషకరమని రజత్‌కుమార్ అన్నారు. ఈసారి 70వేల మంది దివ్యాంగులు అదనంగా ఓటరు జాబితాలో చేరారని స్పష్టం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీసు స్టేషన్లలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని సీపీ అంజనీకుమార్ అన్నారు. తమకు ఎదురయ్యే సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
దివ్యాంగులకు ఓటరు అవగాహన కార్యక్రమం
ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అవగాహన కార్యక్రమాలతో ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. నెక్లెస్ రోడ్డులో దివ్యాంగులకు ఓటు అవగాహన కార్యక్రమాన్ని ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ప్రారంభించారు.
ఓటరు అవగాహన
కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, దివ్యాంగులు భారీగా పాల్గొన్నారు. ఈసారి 100 శాతం పోలింగ్ నమోదు కావాలని అధికారులు ఆకాంక్షించారు.
ఇదీ చదవండి :'ఇవాళ అర్ధరాత్రి వరకు ఆస్తిపన్ను చెల్లించవచ్చు'
Last Updated : Mar 31, 2019, 1:45 PM IST