హైదరాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధ్య మండల అదనపు డీసీపీ గంగారెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించడానికే తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని డీసీపీ గంగారెడ్డి అన్నారు.
ముషీరాబాద్‌లో నిర్భంధ తనిఖీలు - డీసీపీ గంగారెడ్డి
హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్య మండల అదనపు డీసీపీ గంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకే తనిఖీలు చేసినట్లు ఆయన తెలిపారు.
ముషీరాబాద్‌లో నిర్భంధ తనిఖీలు