తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ఎంపీల ప్రశ్నలకు.. కేంద్ర మంత్రుల లిఖితపూర్వక సమాధానాలు! - ఎంపీ అసదుద్దీన్​

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ ఎంపీలు లోక్​సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు లిఖిత పూర్వకంగా సమాధానాలిచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఉపకార వేతనాలు, వలస కార్మికులు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఎంపీలకు సమాధానాలు ఇచ్చారు.

Central Ministers Answers to Telangana Mps
తెలంగాణ ఎంపీల ప్రశ్నలకు.. కేంద్ర మంత్రుల లిఖితపూర్వక సమాధానాలు!

By

Published : Sep 14, 2020, 11:07 PM IST

వర్షాకాల పార్లమెంట్​ సమావేశాల్లో తొలిరోజు.. తెలంగాణ ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఉపకార వేతనాల గురించి అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్​ పోఖ్రియాల్​ నిశాంక్​ లిఖిత పూర్వక సమాధానం పంపారు. 2017-18 విద్యా సంవత్సరంలో రూ.14 కోట్లు, 2018-19లో రూ.6 కోట్లు, 2019-20 లో రూ.12 కోట్లు విడుదల చేసినట్టు లిఖిత పూర్వక సమాధానం పంపారు. కేంద్రీయ విద్యాలయాలకు నిర్ణీత నమూనాలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా ప్రతిపాదనలు అందలేదని.. ప్రతిపాదనలు వస్తే.. కేంద్రం నిర్ణయం ప్రకటింస్తుందని సమాధానమిచ్చారు.

మధ్యాహ్న భోజన పథకంపై మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడిగిన ప్రశ్నకు... కేంద్ర మంత్రి రమేష్​ పోఖ్రియాల్​ ఈ ఏడాదిలో మార్చి నుంచి ఆగస్టు వరకు ఒక్కో విద్యార్థఇకి 12 కిలోల బియ్యం, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1500 అందజేసినట్టు తెలిపారు. భువనగిరి, నిజామాబాద్‌ల్లో కేంద్రీయ విద్యాలయాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయని... ఝరాసంగం, బోధన్, సిరిసిల్ల, మంచిర్యాల, ఆదిలాబాద్, సిద్ధిపేట, మహబూబాబాద్‌ల్లో ప్రణాళిక దశలో ఉన్నాయని మరో ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

వలస కార్మికులపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు... లాక్​డౌన్ కాలంలో దేశంలో విభిన్న ప్రాంతాల నుంచి తెలంగాణకు చెందిన 37,050 మంది, ఆంధ్రప్రదేశ్​కు చెందిన 32,571 మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఇదీ చూడండి: జేఈఈ మెయిన్స్‌లో గురుకులాల విద్యార్థుల ప్రతిభ

ABOUT THE AUTHOR

...view details