Piyush Goyal on Cm kcr: తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని కృషి చేస్తున్నారని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్న ఆయన... తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తోందని ఆరోపించారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించామని పీయుష్ గోయల్ స్పష్టం చేశారు.
అదనంగా 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేందుకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామని పీయుష్ వెల్లడించారు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదని మరోమారు తెలిపారు. నాలుగుసార్లు గడువు కూడా పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.