తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త రైల్వే లైన్ నిర్మించే ఉద్దేశమేమీలేదు: పీయూశ్​ గోయల్

హైదరాబాద్- విజయవాడ మధ్య ఎన్‌హెచ్ 65కి సమాంతరంగా కొత్త రైల్వే లైన్ నిర్మించే ఉద్దేశమేమీలేదని రైల్వేశాఖ మంత్రి పీయూశ్​ గోయల్ తెలిపారు. కాజీపేట్- విజయవాడ మూడో లైన్ నిర్మాణం పురోగతిలో ఉందని అందువల్ల హైదరాబాద్- విజయవాడ మధ్య కొత్త లైన్ అవసరం లేదని పేర్కొన్నారు. లోక్​సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

కొత్త రైల్వే లైన్ నిర్మించే ఉద్దేశమేమీలేదు: పీయూశ్​ గోయల్
కొత్త రైల్వే లైన్ నిర్మించే ఉద్దేశమేమీలేదు: పీయూశ్​ గోయల్

By

Published : Mar 24, 2021, 10:30 PM IST

హైదరాబాద్- విజయవాడ మధ్య ఎన్‌హెచ్ 65కి సమాంతరంగా కొత్త రైల్వే లైన్ నిర్మించే ఉద్దేశమేమీలేదని రైల్వేశాఖ మంత్రి పీయూశ్​ గోయల్ తెలిపారు. లోక్​సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం హైదరాబాద్- విజయవాడ మధ్య రెండు రైల్వే మార్గాలు ఉన్నాయని ఒకటి కాజీపేట మీదుగా మరొకటి గుంటూరు మీదుగా వెళ్తుందన్నారు. కాజీపేట్- విజయవాడ మూడో లైన్ నిర్మాణం పురోగతిలో ఉందని అందువల్ల హైదరాబాద్- విజయవాడ మధ్య కొత్త లైన్ అవసరం లేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రూ.11.63 కోట్ల విలువైన 25 కిలోల బంగారం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details