పీఎంజీఎస్‌వై పథకం కింద తెలంగాణకు 12,961 కిలోమీటర్ల రహదారి మంజూరు చేయగా.. అందులో 10,899 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లోక్సభలో వెల్లడించారు. తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి ఆడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రానికి మొదటి దశలో 10,192 కిలోమీట్లరకు గానూ.. 9,796 మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు. రెండో దశలో 944 కిలోమీటర్లు మంజూరు కాగా.. 895 కి.మీ పూర్తయినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
'మూడోదశలో 2247 కిలోమీటర్ల రహదారుల నిర్మాణమే లక్ష్యం' - తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద తెలంగాణలో ఇప్పటివరకు 10,899 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తయిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. లోక్సభలో తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
వామపక్షాల ప్రభావిత ప్రాంతాలకు 705 కిలోమీటర్లు మంజూరు చేస్తే ఇప్పటిదాకా కేవలం 175 కిలోమీటర్ల నిర్మాణం మాత్రమే పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. పీఎంజీఎస్‌వై మూడో దశ కింద వ్యవసాయ మార్కెట్ యార్డులు, మాధ్యమికోన్నత పాఠశాలలు, ఆసుపత్రులకు రహదారుల కోసం 2,247 కిలోమీటర్ల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఇప్పటికే 1120 కిలోమీటర్లు మంజూరుచేస్తే.. కేవలం 93 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా నిధులు కేటాయించలేదని.. గతంలో ఖర్చుకాని నిధులు రాష్ట్రాల వద్ద ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.