తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్రోకు రూ. 1200 కోట్లు ఇచ్చాం: కిషన్​ రెడ్డి - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

మెట్రోకు రవాణా వ్యవస్థను అనుసంధానించాలన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. మెట్రో నిర్మాణానికి కేంద్ర నుంచి ఇప్పటికే రూ. 1200 కోట్లు ఇచ్చామని తెలిపారు.

central minister kishan reddy
కిషన్​ రెడ్డి

By

Published : Feb 15, 2020, 4:15 PM IST

మెట్రో ప్రాజెక్టు రూ.1458 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే కేంద్రం రూ.1200 కోట్లు ఎల్‌ అండ్‌ టీకి ఇచ్చిందన్నారు. మెట్రోకు రవాణా వ్యవస్థను అనుసంధానించాలన్నారు. ఈ విషయమై మెట్రో, ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. పార్లమెంట్​ సమావేశాలు ఉన్నందన జేబీఎస్​, ఎంజీబీఎస్​ మెట్రో మార్గం ప్రారంభోత్సవానికి రాలేకపోయానన్నారు.

మెట్రో రైలు వస్తే పాత నగర రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. పాత నగరానికి మెట్రో రాకుండా మజ్లిస్‌ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. మెట్రోకు సమాంతరంగా ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 పూర్తిచేయాలన్నారు. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్‌ చేపట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్ర వాటా కంటే అదనపు నిధులతో ఎంఎంటీఎస్‌ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తే ఎంఎంటీఎస్‌ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేంద్రం తన బాధ్యతగా పురపాలికల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. స్మార్ట్‌ సిటీలు, రెండు పడక గదుల ఇళ్లకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. రెండు పడక గదుల ఇళ్లకు కేంద్ర వాటా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

కిషన్​ రెడ్డి

ఇవీ చూడండి:శంషాబాద్​లో 1100 గ్రాముల బంగారం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details