మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనను ఇప్పటి వరకు కలవలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తనను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమేనని తెలిపారు. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.
ఈటల ఇప్పటివరకు నన్ను కలవలేదు: కిషన్రెడ్డి
మాజీ మంత్రి ఈటల తనను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమేనని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఈటల తనను కలవలేదని స్పష్టం చేశారు. 15 ఏళ్లు కలిసి పని చేశామని.. ఇప్పుడు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
ఈటల ఇప్పటివరకు నన్ను కలవలేదు: కిషన్రెడ్డి
ఈ సందర్భంగా ఈటలతో కలిసి 15 ఏళ్లు పని చేశానన్న కిషన్ రెడ్డి.. కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కలిసినంత మాత్రాన పార్టీలో చేరతారని భావించలేం కదా అని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తే పోటీలో ఉండాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
Last Updated : May 25, 2021, 7:29 PM IST