రాజకీయాలకతీతంగా కార్పొరేటర్లు ప్రజాసేవకు అంకితం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ విద్యానగర్‌లో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి అడిక్‌మెట్ కార్పొరేటర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
రాజకీయాలకతీతంగా ప్రజాసేవ చేయాలి: కిషన్ రెడ్డి - Adikmet corporator office inaugurated by kishan reddy
హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీయకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అడిక్‌మెట్ కార్పొరేటర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అడిక్‌మెట్ కార్పొరేటర్ కార్యాలయం
జీహెచ్ఎంసీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కార్పొరేటర్లకు పూర్తిస్థాయి నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీయకుండా ప్రజా సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. పాతబస్తీకి మెట్రోను విస్తరించాలని తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశను పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
ఇదీ చదవండి: వామన్‌రావు హత్య కేసులో పోలీసుల నివేదికపై హైకోర్టు సంతృప్తి