kishan reddy clarity on junior NTR meet కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం కావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దాదాపు 45 నిమిషాల సేపు సాగిన సమావేశంలో ఇద్దరి మధ్య సినిమాల గురించి మాత్రమే చర్చ జరిగిందని స్పష్టం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. తెదేపాను ప్రజల్లోకి తీసుకెళ్లిన వైనంపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చిందని’ పేర్కొన్నారు.
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై కిషన్ రెడ్డి క్లారిటీ - junior ntr and union minister amit shah
kishan reddy clarity on junior NTR meet కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే
ఆదివారం మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్ విచ్చేసిన అమిత్‌షా శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్‌కు రాత్రి 10.26కి చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ అక్కడికి వచ్చారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎన్టీఆర్‌ను అమిత్‌షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌ను అమిత్‌షా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించగా.. అమిత్‌షాకు ఎన్టీఆర్ శాలువా కప్పి సత్కరించారు. అనంతరం వీరిద్దరితో పాటు పార్టీ నాయకులు కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్, బండి సంజయ్‌లు కలిసి భోజనం చేశారు.
ఇవీ చదవండి:
TAGGED:
kishan reddy