తెలంగాణ

telangana

ETV Bharat / state

Central Election Commission Telangana Tour : హైదరాబాద్​కు ఈసీ బృందం.. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

Central Election Commission Telangana Tour : శాసనసభ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా.. కేంద్ర ఎన్నికల సంఘం నేటినుంచి.. మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది. రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులతో సమావేశం కానున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని పూర్తిస్థాయి బృందం.. ఎన్నికల ప్రణాళికలు, ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించనుంది. జిల్లాల వారీగా సమీక్షించడం సహా ప్రలోభాల కట్టడిపై ప్రధానంగా దృష్టిపెట్టనుంది.

eci visit hyderabad
CEC Telangana Tour

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 6:02 AM IST

Central Election Commission Telangana Tour for Three Days : శాసనసభ ఎన్నికలకు.. సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఓటర్ల జాబితా, ఈవీఎంల సన్నద్ధం, అధికారులకు శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రానున్న వారం, పది రోజుల్లోపు ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission).. రాష్ట్రంలో ఎన్నికల సన్నాహకాలను సమీక్షించనుంది. ఇందుకోసం నేటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మూడ్రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది.

Voter Awareness Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. పోలింగ్ శాతం పెంచడంపై స్పెషల్ ఫోకస్

Telangana Assembly Elections 2023 :ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ (Rajeev Kumar) నేతృత్వంలోని ఈసీ బృందం.. ఎన్నికల ఏర్పాట్లు, సన్నాహకాలు పర్యవేక్షించనుంది. కొందరు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకొన్నారు. సీఈసీ సహా ఇతర కమిషనర్లు.. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. గుర్తింపు పొందిన 10 రాజకీయ పార్టీల ప్రతినిధులతో బృందం సమావేశమవుతుంది. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి వారి నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించనుంది.

ECI Hyderabad Tour : ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశం కానున్న సీఈసీ.. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఉచిత కానుకలకి అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపడుతోంది. ఆ దిశగా ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో కలిసి.. రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందాలు ఏర్పాటుచేశారు. ఎన్నికల్లో అధికంగా వ్యయం చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలు గుర్తించి.. వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టనున్నారు. అందుకు సంబంధించిన అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులతో ఈసీ (CEC) బృందం చర్చించనుంది.

CEO Vikas Raj Review on Voter Enrolment in Hyderabad : 'ఓటు హక్కు నమోదు చేసుకునేలా.. ఓటర్లను చైతన్య పరచాలి'

అసెంబ్లీ ఎన్నికలకి చేస్తున్న ఏర్పాట్లు, ప్రణాళికలను ఉన్నతాధికారులు వివరించనున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీస్‌ బలగాల నోడల్ అధికారులు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. రెండో రోజు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్ కమిషనర్లతో సమావేశం కానున్నఈసీ బృందం.. జిల్లాల వారీగా ఎన్నికల ప్రణాళికలు, పరిస్థితులు, ఏర్పాట్లు సమీక్షించనుంది. మూడోరోజు దివ్యాంగ ఓటర్లు, ఇతర వర్గాల ఓటర్లతో సమావేశంకానున్నారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీనియర్ అధికారులతో బృందం భేటీ అవుతుంది. ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ అంశాలు, ప్రవర్తనా నియమావళి అమలు, ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలు, తదితరాలపై చర్చించనుంది. శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలపై మూడురోజుల పాటు పూర్తి స్థాయిలో సమీక్షించి దిల్లీ వెళ్లిన అనంతరం ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకొంటారు.

'ప్రలోభాలకు ఆస్కారం ఉండొద్దు.. అభ్యర్థుల వ్యయంపై నిఘా ఉంచండి'

EC Focus on Telangana Assembly Elections 2023 :మరోవైపు ఇటీవలే శాసనసభ ఎన్నికల్లో (Assembly Elections) ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై.. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఆ తరహా వాటిని గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో భారీగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎక్కువగా వ్యయం చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలను.. సమస్యాత్మక నియోజకవర్గాలుగా పరిగణించనున్నారు.

EC Focus on Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ఫోకస్.. విచ్చలవిడి వ్యయానికి అడ్డుకట్ట వేసేందుకు పక్కా ప్లాన్

Telangana Assembly Elections 2023 : హైదరాబాద్​కు ఈసీ.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

ABOUT THE AUTHOR

...view details