EC Sanctions On Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలకు హాజరు కావొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. మీడియాలో మాట్లాడవద్దని.. ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని, అభిప్రాయాలు వెల్లడించవద్దని పేర్కొంది. ఇటీవల మునుగోడు ఎన్నిక ప్రచారంలో సంక్షేమ పథకాలు నిలిపివేస్తానని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం మంత్రిని శుక్రవారం వివరణ కోరింది. ఈరోజు సాయంత్రం వరకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే జగదీశ్ రెడ్డి సమాధానంతో సంతృప్తి చెందని ఈసీ.. మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఆంక్షలు విధించింది.
అప్పటి వరకు మీడియాతో మాట్లాడొద్దు.. మంత్రి జగదీశ్‌రెడ్డికి ఈసీ షాక్ - మునుగోడు ఉపఎన్నికలు తాజా వార్తలు
19:04 October 29
అప్పటి వరకు మీడియాతో మాట్లాడొద్దు.. మంత్రి జగదీశ్‌రెడ్డికి ఈసీ షాక్
అసలేెం జరిగిదంటే:‘పింఛన్లు, రైతుబంధు, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేయండి. కేసీఆర్‌కు మద్దతుగా నిలవండి. పథకాలు వద్దనుకుంటే మోదీకి ఓటేయండి. రూ.3 వేల పింఛను ప్రధాని మోదీ కుదరదన్నారు. తప్పక ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆ పథకాలు కావాలనుకుంటే కేసీఆర్‌కు ఓటు వేయండి’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారంటూ భాజపా చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు నోటీసు జారీ చేసింది.
ఇవీ చదవండి:మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు
'మునుగోడు ఉపఎన్నిక ట్రైలర్ మాత్రమే.. కేసీఆర్ నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు'
369 అడుగుల శివుడి విగ్రహ ఆవిష్కరణ అపురూపమైన దృశ్యమాలిక మీకోసం