నిఘానేత్రంతో నేరగాళ్ల ఆటకట్టించొచ్చని, నేరం జరిగిన వెంటనే నిందితులు పట్టుబడుతున్నారని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గవర్నమెంట్ ప్రెస్ కాలనీ, రెసిడెన్షియల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీల్లో సుమారు రూ.7లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల సంఖ్య తగ్గిందని, ప్రజల సహకారంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
నిఘానేత్రాల నీడలో నగరం భద్రం.. - cp mahesh baghat
సీసీ కెమెరాల నిఘాలో నేరాలు నిక్షిప్తం కావడంవల్ల కేసుల ఛేదన మరింత సులువవుతోందని పోలీసులు తెలిపారు. సరూర్ నగర్‌లోని గవర్నమెంట్ ప్రెస్ కాలనీలో రెసిడెన్సియల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీల్లో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ప్రారంభించారు.
cc-cameras