CBN and lokesh on formation day: తెదేపా కార్యకర్తలు, నేతలు, అభిమానులకు.. పార్టీ అధినేత చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం.. రాజకీయ అనివార్యమన్నారు. ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు.
40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది.కొందరికే పరిమితమైన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది.తెలుగుదేశం అంటేనే అభివృద్ధి..సంక్షేమం.సంస్కరణల ఫలితాలు గ్రామ స్థాయికి అందించిన చరిత్ర తెదేపాది. పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెదేపానే.ప్రాంతీయ పార్టీగా ఉన్నా.. జాతీయ భావాలతో సాగే పార్టీ తెదేపా.పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా వేడుకలు నిర్వహించాలి.ప్రతిఒక్కరూ పార్టీ కోసం పునరంకితమయ్యేలా వేడుకలు ఉండాలి. తెదేపా అవసరమేంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలి. - చంద్రబాబు, తెదేపా అధినేత
ఎన్ఆర్ఐ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు..తెదేపా 40 ఏళ్ల వేడుకల్లో భాగంగా.. ఎన్ఆర్ఐ అభిమానులను ఉద్దేశించి పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. తెదేపా ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలదొక్కుకుంటుందని.. పార్టీ స్థాపించిన ముహూర్త బలం అలాంటిందని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెదేపా పుట్టిందని.. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగు చరిత్ర అంటే తెదేపా ఆవిర్భావానికి ముందు, తర్వాత అని చదవాల్సిందేనన్నారు.