జీహెచ్ఎంసీ ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్‌పై కేసు నమోదు - తెలంగాణ తాజా వార్తలు
20:46 December 11
జీహెచ్ఎంసీ ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్‌పై కేసు నమోదు
కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్‌పై కేసు నమోదైంది. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, అతని అనుచరులు తనపై దాడిచేశారని రాజు నాయుడు అనే వ్యక్తి జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎల్లమ్మబండ పిజేఆర్ నగర్‌కు చెందిన రాజు నాయుడుకి జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎంలో రాజు నాయుడు, అతడి బంధువులకు ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో మూడు ప్లాట్లు, పది లక్షల రూపాయలు ఇవ్వాలని కార్పొరేటర్ డిమాండ్ చేస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. తాను నిరాకరించడం వల్ల అనుచరులతో కలిసి బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్ అతని అనుచరులు కాశీ యాదవ్, జిల్లా గణేశ్, భాస్కర్‌తో వచ్చి తనతో పాటు కుటుంబ సభ్యులపైన దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని భాజపా నాయకుడు రవి యాదవ్ పరామర్శించారు.
ఇదీ చూడండి:పోకిరీగాళ్లపై షీ టీం పంజా.. 3 నెలల్లో 74 మంది అరెస్ట్