లాక్‌డౌన్ నేపథ్యంలో ముషీరాబాద్ కేర్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ మీనాజ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కేర్ ఆసుపత్రి ప్రముఖ కార్డియాలజిస్ట్ జి.సూర్య ప్రకాశ్ హాజరై... స్థానిక పఠాన్ బస్తీలోని 200 మంది పేదలకు నిత్యావసర సరకులను ఆసుపత్రి ఆవరణలో అందజేశారు.
నిత్యావసరాలను పంపిణీ చేసిన కేర్ ఆసుపత్రి వైద్యులు - Care hospital doctors help to poor people
వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ప్రజలంతా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని కేర్ ఆసుపత్రి ప్రముఖ కార్డియాలజిస్ట్ జీ సూర్య ప్రకాశ్ సూచించారు. కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని పేర్కొన్నారు.
Hyderabad latest news
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్క్ ధరించటంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.