హైదరాబాద్ తార్నాకలోని ఇఫ్లూలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. నాచారానికి చెందిన శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇఫ్లూ క్యాంపస్‌లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో డ్యూటీకి వచ్చి క్యాంపస్‌లోని డ్రైవర్స్ రెస్ట్ రూమ్‌లో ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత రూమ్‌ను క్లీన్ చేయడానికి వచ్చిన మహిళ స్వీపర్‌కు అచేతనంగా పడి ఉన్న శ్రీనివాస్ కనిపించాడు. పిలిచినా పలకకపోవడం వల్ల క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్ డాక్టర్ వచ్చి పరీక్షించి పల్స్ పడిపోయాయని గాంధీ ఆస్పత్రికి తరలించారు.