ఏపీ రాజధానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... 42వ రోజు వివిధ రూపాల్లో రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. వీరికి ప్రవాసాంధ్రులు మద్దతు తెలిపారు. ఇవాళ తుళ్లూరు నుంచి వెలగపూడి వరకూ బైక్ ర్యాలీ నిర్వహించి... ప్రభుత్వ నిర్ణయాలపై స్థానికులతో మాట్లాడనున్నారు.
43వ రోజుకు చేరిన.. అమరావతి రైతుల నిరసన
43 రోజులుగా దీక్ష చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఏపీ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వ్యతిరేకంగా వేసిన కేసును వాదిస్తున్న న్యాయవాది కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-January-2020/5877974_93_5877974_1580256229516.png
ఓట్లకోసం తమ గడపలు తొక్కిన ప్రజాప్రతినిధులు... ఇప్పుడు తమ ఆవేదన వినట్లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్