కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నిలిచిపోయిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఆ సమావేశానికి తాను, సికింద్రాబాద్ ఎంపి, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటామన్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం కేంద్రం నుంచి 500 కోట్లు నిధులు మంజూరైనప్పటికీ, రెండు సంవత్సరాలనుంచి పెండింగ్ లో ఉన్నాయని బోర్డు సభ్యుడు కేశవ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటు పడ్డాయని, ప్రజాసమస్యలు నిలిచిపోయాయని బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ అన్నారు. నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తామని బ్రిగేడియర్ అబిజిత్ చంద్ర చెప్పారు. డిఫెన్స్ ఎస్టేట్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ సబ్ ఏరీయా కమాండర్ బ్రిగేడియర్ అబిజిత్ చంద్ర అధ్యక్షతన ఈ బోర్డు సమావేశం జరిగింది.
కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తా: రేవంత్ రెడ్డి
కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. చాలా కాలం తర్వాత బోర్డు మీటింగ్ జరిగింది. ప్రజాసమస్యలపై చర్చలు జరిగాయి. నిలిచిపోయిన అభివృద్ధి పనులను వేగంవంతం చేసే దిశగా బోర్డ్ సమావేశంలో చర్చించారు.
కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తా: రేవంత్ రెడ్డి