రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై సర్కార్ దృష్టి సారించింది. ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారిగా సమావేశమైంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన బీఆర్కే భవన్లో జరిగిన సమావేశంలో మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
cabinet subcommittee: మౌలిక సదుపాయాల కల్పనే తొలిప్రాధాన్యం - హరీశ్ రావు వార్తలు
ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారిగా సమావేశమైంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన బీఆర్కే భవన్లో ఈ భేటీ నిర్వహించారు.
కేబినెట్ సబ్‌కమిటీ భేటీ, హరీశ్ రావు
ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు విశ్లేషించి మెరుగుపరచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయాలు, అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు. పేద ప్రజలకు ప్రభుత్వ సాధారణ వైద్య సేవలతో పాటు ప్రత్యేక వైద్య చికిత్సలు మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.
ఇదీ చదవండి:ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు