రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదవడంతో.. ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని వైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా అత్యవసరంగా ఉదయం 10 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రివర్గ ఉపసంఘం నేతృత్వంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో మంత్రులు కేటీఆర్, ఈటల, ఎర్రబెల్లి దయాకర్‌రావులు సభ్యులు. వీరి నేతృత్వంలో పంచాయతీరాజ్, పురపాలక, విద్య, సమాచార ప్రజా సంబంధాలు, రవాణా, పోలీసు, రెవెన్యూ, పర్యాటక శాఖలతో నిర్వహించనున్న ఈ సమన్వయ సమావేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందిస్తారు.
నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ - carona in hyderabad
హైదరాబాద్‌లో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సలహాతో ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి ఈటల తెలిపారు.

కరోనా ఎఫెక్ట్: రేపు మంత్రివర్గ ఉపసంఘం భేటీ
కరోనా ఎఫెక్ట్: రేపు మంత్రివర్గ ఉపసంఘం భేటీ
వందలు, వేల సంఖ్యలో ప్రజలు గుమికూడడానికి అవకాశముండే పాఠశాలలు, కళాశాలల వంటి చోట్ల వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు సత్వర చర్యలు చేపట్టనున్నారు.
ఇదీ చూడండి: హైదరాబాద్, దిల్లీలో కరోనా కేసులు నమోదు
Last Updated : Mar 3, 2020, 7:36 AM IST