ధరణిలో వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘం(cabinet sub committee) ఆదేశించింది. ధరణి పోర్టల్‌లో(dharani portal) వచ్చే సమస్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన బీఆర్కే భవన్లో సమావేశమైంది. ధరణిలో ఉన్న సమస్యలు, ఫిర్యాదులు, వివిధ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించింది.
Dharani Meeting: 'ధరణి'పై మంత్రివర్గ ఉప సంఘం భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ - ధరణి సమస్యలు
ధరణి పోర్టల్‌కు(dharani portal) సంబంధించిన ఫిర్యాదులపై మంత్రివర్గ ఉపసంఘం(cabinet sub committee) దృష్టి సారించింది. సమస్యలను పరిష్కారంపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో హరీశ్ రావు అధ్యక్షతన సమావేశమైంది. ధరణి ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం (cabinet sub committee)ఆదేశించింది.
ఈ సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఇబ్బందులపై మంత్రివర్గ ఉపసంఘం(cabinet sub committee) సమీక్షించింది. ధరణిలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరిస్తే ప్రజలకు, రైతులకు మరింత మేలు జరుగుతుందని తెలిపింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై ఈ నెల 17వ తేదీన మరోమారు సమావేశం నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం(cabinet sub committee) నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హరీష్, హనుమంత రావు, ఆర్డీఓలు శ్రీనివాస్, కిషన్ రావు, క్రెడాయ్, ట్రెసా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: