తెలంగాణ

telangana

ETV Bharat / state

పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం - gun

సికింద్రాబాద్​ నుంచి ఫిల్మ్​నగర్​ వెళ్తోన్న బస్సులో ఓ వ్యక్తిని కిందకు దిగమన్నారని గాల్లోకి కల్పులు జరిపాడు. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్​స్టాప్​లో బస్సు ఆపకుండానే డ్రైవర్​ తీసుకెళ్లగా... ఆ వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం

By

Published : May 2, 2019, 1:15 PM IST

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్​ 2 బస్టాప్‌ వద్ద కాల్పుల ఘటన కలకలం రేపింది. బస్టాప్‌లో బస్సు దిగే సమయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య వాగ్వాదం తలెత్తింది. సఫారీ దుస్తుల్లో ఉన్న వ్యక్తి జేబులోంచి తుపాకి తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. బస్సు పైభాగంలో తూటా దూసుకుపోయి రంధ్రం పడింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆర్టీసీ బస్సు కంటోన్మెంట్‌ డిపోకు చెందినదిగా గుర్తించారు. బస్సులో కాల్పుల ఘటనపై ఆర్టీసీ విచారణ చేపట్టింది. ఆర్టీసీ ఈడీ వినోద్‌ బస్సు డ్రైవర్‌ సయ్యద్‌పాషా, కండక్టర్‌ భూపతిని అడిగి ఘటనపై ఆరా తీశారు. డ్రైవర్, కండక్టర్‌లను మరోసారి విచారిస్తామని ఈడీ వినోద్‌ పేర్కొన్నారు. కాల్పులపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. మీడియా ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు కాల్పుల ఘటనపై సీపీ అంజనీకుమార్‌ ఆరా తీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details