హైదరాబాద్లో బుధవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. సాయంత్రం ఖాళీ చేసిన ఇళ్లు రాత్రి సమయంలో కూలిపోయాయి. సాయినాథ్ గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో చకాన్వడిలో రెండంతస్థుల పురాతన భవనం కుంగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, విపత్తు నిర్వహణ సిబ్బంది పక్క భవనాలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ఇటీవల నగరంలో వరుస వర్షాలు పడుతుండడం వల్ల కూలిపోయే అవకాశం ఉందని... ఈ ఇంట్లో నివసించే ఇద్దరు వృద్ధులను వారి కూతురు ఆమె ఇంటికి తీసుకెళ్లింది. ఇక మొదటి అంతస్తులో వృద్ధుల కుమారుడి కుటుంబం ఉండేవారు. వారు కూడా ఇదే రోజు పక్క వీధికి మారారు. ముందే ఖాళీ చేయడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
కుంగిన పురాతన భవనం... తప్పిన ప్రాణనష్టం - కుంగిన పురాతన భవనం... తప్పిన ప్రాణనష్టం
హైదరాబాద్ చకాన్వాడిలో పురాతన భవనం కుంగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
కుంగిన పురాతన భవనం... తప్పిన ప్రాణనష్టం